ఆర్‌బీకేలకు చంద్రగ్రహణం
జగన్ హయాంలో రైతులకు విశిష్ట సేవలు అందించిన కేంద్రాలు
అధికారంలోకి వచ్చాక కక్షగట్టిన చంద్రబాబు సర్కారు
హేతుబద్ధీకరణ పేరుతో కుట్రలు
జిల్లాలో 125 కేంద్రాల మూసివేత
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, దేశంలో మరెక్కడా లేని విధంగా 2020లో అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ఏర్పాటు చేశారు.వ్యవసాయం, పట్టు, పాడి, పశుపోషణ, మత్స్య, ఉద్యానం, మార్కెటింగ్, ఏపీఎంఐపీ తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి రైతు నేస్తాలుగా మార్చారు. అన్నదాతలు ఊరు దాటి బయటకు వెళ్లకుండా అన్ని రకాల సేవలు వారి ముంగిటకే అందించాలనే సమున్నత ఆలోచనతో.. వన్‌స్టాప్ సెంటర్లుగా మార్చి విత్తు నుంచి విపత్తు వరకు, పంట సాగు నుంచి విపణిలో పంట అమ్ముకునే దాకా రైతులకు విశేష సేవలు అందించారు. గ్రామ స్థాయి పంట ప్రణాళిక అమలు చేస్తూ అడుగడుగునా రైతులకు అండగా ఉండేలా తీర్చిదిద్దారు. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా భవనాలు నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెసీమల్లో ఆర్‌బీకేలు రైతులకు ఆలయాలుగా మారిపోయాయి. అలా ఒకే విడతగా జిల్లాలో ఏకంగా 451 ఆర్‌బీకేలు ఏర్పాటు చేసి అక్కడ వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏలను ఆర్‌బీకే అసిస్టెంట్లుగా నియమించి రైతుల సేవకు అంకితం చేశారు.
హేతుబద్ధీకరణ పేరుతో క్లోజ్..
రైతును రాజుగా చేయాలనే బృహత్తర ఆశయంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌బీకేల ద్వారా అందుతున్న సేవల గురించి దేశంలో ఉన్న పలు రాష్ట్రాలు, అలాగే విదేశీ బృందాలు తెలుసుకుని ప్రశంసలు గుప్పించాయి. అయితే సీఎం చంద్రబాబు నేతృత్వంలో సర్కారు ఏర్పాటయ్యాక ఆర్‌బీకేలను ఆర్‌ఎస్‌కేలు పేరు మార్చేశారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ఆర్‌ఎస్‌కేలను నిర్వీర్యం చేయడానికి కుట్రలకు తెరతీశారు. హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) అంటూ కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి ఆర్‌ఎస్‌కేలను పెంచాల్సింది పోయి తగ్గించేస్తూ వస్తున్నారు. మొదటి విడతగా గతేడాది 15 ఆర్‌ఎస్‌కేలను మూసేశారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 451 ఆర్‌బీకేలు ఉండగా నేడు వాటి సంఖ్య 326కు చేరింది. 126 ఆర్‌ఎస్‌కేల్లో వీఏఏలు, 180 ఆర్‌ఎస్‌కేలో వీహెచ్‌ఏలు, 12 ఆర్‌ఎస్‌కేల్లో వీఎస్‌ఏలు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఉన్న 8 ఆర్‌ఎస్‌కేల్లో ఎంపీఈవోలను నియమించారు. రెండేళ్లు తిరగకుండానే ఏకంగా 125 ఆర్‌ఎస్‌కేలను మూసివేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు మరికొన్ని ఆర్‌ఎస్‌కేలను క్లోజ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక పథకం ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం ఆర్‌బీకేలను నిర్వీర్యం చేస్తూ రైతులకు సేవలు అందకుండా చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్‌ఎస్‌కేలు


