ఆభరణాలు అప్పగించలేదు
నేమకల్లు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన ఆభరణాల లెక్కలు పూర్తిస్థాయిలో పాత ఈఓ అప్పగించలేదు. పని ఒత్తిడి వల్ల సకాలంలో రాలేకపోయారు. స్వామికి వినియోగించే విలువైన ఆభరణాలన్నీ అర్చకుల అధీనంలో ఉంచాం. మిగిలిన సొమ్ము లాకర్‌లోనే ఉంచినట్టు బదిలీపై వెళ్లిన ఈఓ తెలిపారు. వినియోగంలో లేని సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. త్వరలో ప్రతి వస్తువునూ స్వాధీనం చేసుకుంటాం. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చూస్తాం. ఆందోళ చెందాల్సిన అవసరం లేదు.
– నరసింహారెడ్డి, ఈఓ, రాయదుర్గం


