రోడ్డు సేఫ్టీ మిషన్‌తో ప్రమాదాల నియంత్రణ
అనంతపురం సెంట్రల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం రోడ్డు సేఫ్టీ మిషన్‌ను ప్రారంభించినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. మంగళవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ విభాగాలు, ఎన్‌జీవోలు, స్కూల్స్, కాలేజీలు, అంబులెన్స్ నిర్వాహకులు, వాహనాల షోరూం డీలర్లు తదితరులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రహదారులపై 34 బ్లాక్ స్పాట్స్, 27 యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలు గుర్తించినట్లు వివరించారు. గత మూడేళ్లలో ప్రమాదాలు చూస్తే ఎక్కువశాతం హెల్మెట్, సీటు బెల్టు వాడకపోవడం, ఓవర్‌స్పీడ్, డ్రంక్‌డ్రైవ్ తదితర కారణాలుగా తేలాయన్నారు. అందరం చేయి చేయి కలిపి రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేద్దామని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వం ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి రోడ్డు సేఫ్టీ మిషన్ పోగ్రాంను అమలు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ నెల 31 వరకూ స్కూల్, కాలేజీల్లో అవగాహన తరగతులు, వీడియోలు, ర్యాలీల ద్వారా ప్రచారం కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్వనీ మణిదీప్, అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్టీఓ సురేష్‌నాయుడు, సీఐలు వెంకటేష్ నాయక్, విజయభాస్కర్‌గౌడ్, షేక్ జాకీర్, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, రాజేంద్రనాథ్ యాదవ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
10 శాతం రోడ్ సేఫ్టీ సెస్
జీవిత కాల పన్ను చెల్లించే వాహనాలపై ఇక నుంచి 10 శాతం రోడ్డు సేఫ్టీ సెస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) వీర్రాజు తెలిపారు. మంగళవారం ఆయన చాంబర్‌లో వాహన డీలర్లతో సమావేశం నిర్వహించారు. డీటీసీ మాట్లాడుతూ.. త్వరలో వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ డివైజ్ కూడా వాహనాలకు అమర్చాల్సి ఉంటుందని తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పెండింగ్ పైల్స్‌పై సమీక్షించారు. రవాణాశాఖ సిబ్బంది పేరుచెప్పి అదనపు వసూళ్లకు పాల్పడితే ఆయా డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీఓ సురేష్‌నాయుడు, రవాణాశాఖ సిబ్బంది, డీలర్లు పాల్గొన్నారు.


