గవిమఠం ఇన్‌చార్జ్ ఏసీ బాధ్యతల నుంచి వైదొలిగిన రాణి
ఉరవకొండ: స్థానిక గవిమఠం ఇన్‌చార్జ్ ఏసీ బాధ్యతల నుంచి ఎట్టకేలకు రాణి తప్పకున్నారు. దీంతో ఆ బాధ్యతలను దేవదాయ శాఖ ఏసీ గంజి మల్లికార్జున మంగళవారం స్వీకరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బాధ్యతలు స్వీకరించేందుకు ఈ నెల 22న గంజి మల్లికార్జున గవిమఠానికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు రాణి విముఖత వ్యక్తం చేశారు. తనకు ఒక్క రోజు సమయం ఇస్తే ‘అన్న’తో సిఫారసు చేయించుకుని అదే స్థానంలో తిరిగి కొనసాగుతానంటూ ప్రాధేయపడ్డారు. ఈ అంశంపై ‘సార్.. ప్లీజ్ ఒక్కరోజు ఆగండి’ శీర్షికన ఈ నెల 23న ‘సాక్షి’లో కథనం వెలుడింది. దీనిపై దేవాదాయ, ధర్మదాయ రాష్ట్ర కమిషనర్ స్పందించారు. బాధ్యతలు అప్పగించకుండా మొండికేసిన రాణిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మంగళవారం మరోసారి గవిమఠానికి చేరుకున్న గంజి మల్లికార్జునకు ఆమె బాధ్యతలు అప్పగించారు.
30న రీజియన్ మున్సిపల్ కమిషనర్ల సదస్సు
అనంతపురం క్రైం: అనంతపురంలో ఈ నెల 30న అనంతపురం రీజియన్‌లోని మున్సిపల్ కమిషనర్ల సమావేశం నిర్వహించనున్నారు. అనంతపురం నగర పాలక సంస్థతో పాటు రీజియన్ పరిధిలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కమిషనర్లు సదస్సులో పాల్గొనాలని కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నగరాల్లో మౌలిక వసతులు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రోడ్లు, వీధి దీపాల నిర్వహణలో సమస్యలు ఉన్నట్టు గుర్తించింది. వీటిపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సుకు హాజరయ్యే మున్సిపల్ కమిషనర్లు తమ యూఎల్‌బీలకు సంబంధించిన సమగ్ర విషయాలతో హాజరు కావాలి సీడీఎంఏ సూచించారు.
శోకసంద్రమైన బేతాపల్లి
గుత్తి రూరల్: మండలంలోని బేతాపల్లి మంగళవారం శోకసంద్రమైంది. ఈ నెల 16న ఇంటికి స్వయానా పెద్దనాన్నే నిప్పు పెట్టడంతో పదేళ్ల నాగసముద్రం లక్ష్మి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం కర్నూలు నుంచి ప్రత్యేకంగా అంబులెన్స్‌లో లక్ష్మి మృతదేహాన్ని తీసుకువస్తున్నట్లుగా తెలుసుకున్న గ్రామస్తులు ఉదయం నుంచి గ్రామంలోనే గుమికూడారు. అన్నపానీయాలు మానేసి ఎదురుచూస్తూ ఎవరికి వారు మౌనంగానే ఉండిపోయారు. మృతదేహంతో అంబులెన్స్ గ్రామానికి చేరుకోగానే ఒక్కసారిగా గ్రామస్తులు చుట్టుముట్టారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మృతదేహాన్ని హత్తుకున్నారు. అనంతరం అశ్రునయనాలతో చిన్నారి అంత్యక్రియలు నిర్వహించారు.
గవిమఠం ఇన్‌చార్జ్ ఏసీ బాధ్యతల నుంచి వైదొలిగిన రాణి
గవిమఠం ఇన్‌చార్జ్ ఏసీ బాధ్యతల నుంచి వైదొలిగిన రాణి


