చదరంగంలో రాణించిన గుంతకల్లు విద్యార్థులు
స్నేహిత్ కార్తికేయన్ లిశాంత్ జ్యోత్స్న ప్రియ నరసింహ
గుంతకల్లు: చదరంగం పోటీల్లో గుంతకల్లుకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాణించి అంతర్జాతీయ రేటింగ్స్ దక్కించుకున్నట్లు కోచ్‌లు అనిల్‌కుమార్, రామారావు తెలిపారు. శుక్రవారం వారు వివరాలను వెల్లడించారు. గత నెలలో బెంగళూరు, బళ్లారి నగరాల్లో నిర్వహించిన చెస్ టోర్నీల్లో బ్లిట్జ్ ఫార్మాట్‌లో గుంతకల్లుకు చెందిన స్నేహిత్ 1,684 రేటింగ్ సాధించి అత్యధిక రేటెడ్ ప్లేయర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడన్నారు. అలాగే క్లాసిక్ రేటింగ్‌లో కార్తికేయన్ 1,430 రేటింగ్, గాజుల లక్ష్మీనరసింహ 1,416 రేటింగ్, రాపిడ్ రేటింగ్‌లో జ్యోత్స్న ప్రియ 1,473, క్లాసిక్ రాపిడ్‌లో లిశాంత్ 1,497 రేటింగ్ సాధించినట్లు వివరించారు.
చదరంగంలో రాణించిన గుంతకల్లు విద్యార్థులు
చదరంగంలో రాణించిన గుంతకల్లు విద్యార్థులు
చదరంగంలో రాణించిన గుంతకల్లు విద్యార్థులు
చదరంగంలో రాణించిన గుంతకల్లు విద్యార్థులు