ప్రపంచ తెలుగు మహాసభలకు విష్ణుభగవాన్
యాడికి: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు వేదికగా శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రాతినిథ్యం వహించాలంటూ యాడికి చెందిన కానిస్టేబుల్ విష్ణుభగవాన్‌కు ఆహ్వానం అందింది. పురాతన నాణేలను సేకరించి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రదర్శిస్తూ వాటి చరిత్రపై ప్రజలు, విద్యార్థులను విష్ణుభగవాన్ చైతన్య పరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ తెలుగు మహాసభల్లో పురాతన నాణేలను ఆయన ప్రదర్శించనున్నారు.
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు చైన్నెలో జరిగే 75 సీనియర్ బాస్కెట్‌బాట్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో జిల్లాకు చెందిన ఇద్దరు చోటు దక్కించుకున్నారు. వీరిలో పురుషుల విభాగంలో ద్వారకనాథ్, మహిళల విభాగంలో పరిమళ ఉన్నారు. వీరి ఎంపికపై జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి నరేంద్ర చౌదరి, కోశాధికారి హబీబుల్లా హర్షం వ్యక్తం చేశారు.
విద్యుదాఘాతంతో టిప్పర్ డ్రైవర్ మృతి
తాడిపత్రి టౌన్: విద్యుత్ షాక్‌తో ఓ టిప్పర్ డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా అవుకు గ్రామానికి చెందిన శివరాముడు (40)కు భార్య మల్లేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టిప్పర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం టిప్పర్ సర్వీసింగ్ కోసమని తాడిపత్రికి వాహనాన్ని తీసుకువచ్చిన అతను కడప మార్గంలో ఉన్న గాలి మిషన్ ట్రాలీకి గ్రీసు వేయించేందుకు లిఫ్ట్ ఎత్తాడు. దీంతో పైనున్న 11 కేవీ విద్యుత్ లైన్ తగులుతుండగా గమనించి వెంటనే కిందకు దూకాడు. అప్పటికే షాక్‌కు గురైన శివరాముడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక రాత్రి శివరాముడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
7న ఉద్యోగ మేళా
అనంతపురం: సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి ఈ నెల 7న అనంతపురంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై న వారికి 30 రోజుల పాటు కొడికొండ చెక్ పోస్టు, హిందూపురంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యంతో శిక్షణ అందించనున్నారు. అనంతరం ప్రభుత్వ సర్టిఫికెట్‌తో పాటు వివిధ సంస్థల్లో సెక్యూరిటీ గార్డు, సూపర్‌వైజర్ పోస్టులను కల్పించనున్నారు.
ప్రపంచ తెలుగు మహాసభలకు విష్ణుభగవాన్
ప్రపంచ తెలుగు మహాసభలకు విష్ణుభగవాన్


