
పలువురికి బళ్లారి రాఘవ అవార్డులు
అనంతపురం కల్చరల్: జిల్లా వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కళాకారులకు బళ్లారి రాఘవ అవార్డులు దక్కాయి. ప్రపంచ నాటక రంగాన్ని ప్రభావితం చేసిన ‘అనంత’ రంగస్థల యోధుడు బళ్లారి రాఘవ జయంతిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం అనంతపురంలోని లలితకళాపరిషత్తులో ప్రత్యేక ఉత్సవాలు, సాంస్కృతిక, నాటక సంబరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నాటక రంగ అభివృద్ధికి కృషి చేసిన నటులు, రచయితలకు పురస్కారాలనందిస్తున్నట్లు ఎల్కేపి కార్యదర్శి పద్మజ వెల్లడించారు. అవార్డులు దక్కిన వారిలో కర్నూలుకు చెందిన రామలింగేశ్వరరావు, బాపట్ల జిల్లా రేపల్లెకు నివాసి భూపతి ధర్మారావు, అనంతపురం జిల్లాకు చెందిన వాల్మీకి కుళ్లాయప్ప, మల్లెల జయరామ్ ఉన్నారు. కార్యక్రమంలో సీనియర్ నటుడు ఎస్‌ఎం బాషా ఆధ్వర్యంలో ‘గోవు మా లచ్చిమి’ నాటకాన్ని ప్రదర్శించనున్నారు.

పలువురికి బళ్లారి రాఘవ అవార్డులు

పలువురికి బళ్లారి రాఘవ అవార్డులు

పలువురికి బళ్లారి రాఘవ అవార్డులు