
ఆదర్శప్రాయుడు జగ్జీవన్‌రామ్
అనంతపురం కార్పొరేషన్: స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయవేత్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్ ఆదర్శప్రాయుడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు. ఆయన పోరాటాలను స్మరించుకోవడంతో పాటు స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగ్జీవన్ ఆశయాలను పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రామ్ స్వాతంత్య్రోద్యమంలో ఎంతో కీలకంగా పని చేశారన్నారు. అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు రావాలని పోరాడారన్నారు. మేయర్ వసీం మాట్లాడుతూ జగ్జీవన్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, అనుబంధ సంఘాల అధ్యక్షులు మల్లెమీద నరసింహులు, అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు పెన్నోబులేసు, మాల్యవంతం మంజుల, చామలూరు రాజగోపాల్, ఎగ్గుల శ్రీనివాసులు, చింతకుంట మధు, రాధాకృష్ణ, పసులూరు ఓబులేసు, కొర్రపాడు హుస్సేన్ పీరా, వనారస బలరాం, లక్ష్మణ్, తలారి వెంకటేష్, అనిల్‌కుమార్ గౌడ్, కార్పొరేటర్లు రహంతుల్లా, కమల్‌భూషణ్, సాకే చంద్రలేఖ, రాజేశ్వరి, శేఖర్‌బాబు, ఇసాక్, తదితరులు పాల్గొన్నారు.
బీసీ కులాలపై
పరిటాల కుటుంబం కక్ష కట్టింది
వైఎస్సార్‌సీపీ కురుబ విభాగం
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివ ధ్వజం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత