పంద్రాగస్టు వేడుకకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు వేడుకకు వేళాయె

Aug 15 2025 6:50 AM | Updated on Aug 15 2025 6:50 AM

పంద్రాగస్టు వేడుకకు వేళాయె

పంద్రాగస్టు వేడుకకు వేళాయె

అనంతపురం అర్బన్‌: పంద్రాగస్టు వేడుకకు పోలీసు పరేడ్‌ మైదానం ముస్తాబయ్యింది. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 9.02 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయుధ బలగాల వందనాన్ని స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటలకు వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రద ర్శన, 10.15కు సాంస్కృతిక కార్యక్రమాలు, 10.40కు విశిష్ట సేవలకు ప్రశంసా పత్రాల ప్రదానం, 11.40 గంటలకు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్ల సందర్శన ఉంటుంది.

413 మందికి అవార్డులు

విధుల్లో విశిష్ట సేవలు అందించిన 413 మంది అధికారులు, ఉద్యోగులను అవార్డులకు ఎంపిక చేశారు. వీరందరూ మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకుంటారు.

అనంతపురం డీఎస్పీకి

విశిష్ట సేవా పురస్కారం

అనంతపురం: అనంతపురం అర్బన్‌ డీఎస్పీ వి. శ్రీనివాస రావుకు విశిష్ట సేవా పురస్కారం దక్కింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శ్రీనివాస రావు పురస్కారాన్ని అందుకోనున్నారు. 1989లో శ్రీనివాస రావు ఎస్‌ఐగా ఉద్యోగం పొందారు. 2004లో సీఐగా, 2014లో డీఎస్పీగా పదోన్నతి వచ్చింది. నూజివీడు, కాకినాడ, చీరాల, విజయవాడ ఈస్ట్‌ డీఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్‌ డీఎస్పీగా పనిచేస్తున్నారు. గతంలో ఏపీ సేవా, ఉత్తమ సేవా, మహోన్నత, కేంద్ర ప్రభుత్వ అతి ఉత్కృష్ట్‌ పతకాలను పొందారు. తాజాగా విశిష్ట సేవా పురస్కారాలను 20 మంది పోలీసు అధికారులకు ప్రకటించగా, వీరిలో వి. శ్రీనివాస రావు ఉండడం గమనార్హం.

కళ్లెదుటే వైకల్యం..

కానరాని కనికరం?

అనంతపురం అర్బన్‌: కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. వైకల్యం కళ్లెదుటే కనిపిస్తున్నా వెరిఫికేషన్‌ పేరుతో పింఛను నిలిపివేస్తుండంతో అంతులేని ఆవేదన మిగులుతోంది. గుత్తి మండలం శ్రీపురానికి (కొజ్జేపల్లి) చెందిన దంపతులు సూర్యనారాయణ, రాజేశ్వరి తమ దివ్యాంగ (బుద్ధిమాద్యం) కుమారుడు మహిధర్‌ను ఎత్తుకుని గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. మహిధర్‌ వయసు తొమ్మిది సంవత్సరాలని, నిలబడలేడు.. కూర్చోలేడని వాపోయారు. తమ బిడ్డకు ఈ నెల పింఛన్‌ నిలిపేశారన్నారు. వెరిఫికేషన్‌ చేయించలేదు.. అందుకే ఆపేశా మని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ ఏడాది ఏప్రిల్‌ 16న అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వెరిఫికేషన్‌ చేయించామని, అయినా పింఛన్‌ నిలిపేయడంతో మళ్లీ గురువారం ఆస్పత్రికి వచ్చి వెరిఫికేషన్‌ చేయించినట్లు వెల్లడించారు. మళ్లీ అప్పట్లోలా ఎక్కడ చేస్తారనే భయంతో వెరిఫికేషన్‌ ప్రక్రియ వీడియో కూడా తీసుకున్నామని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు చెప్పుకుందామని వచ్చినట్లు తెలిపారు. అయితే, ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.

సెంట్రల్‌ వర్సిటీ వీసీ కోరి పదవీకాలం పొడిగింపు

అనంతపురం: సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏపీ వీసీ డాక్టర్‌ ఎస్‌ఏ కోరి పదవీ కాలం ఏడాది పాటు పొడిగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సెక్రటరీ గురువారం దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఆగస్టు 20న వీసీగా కోరి నియమితులయ్యారు. ఆగస్టు 19 వరకు పదవీ కాలం ఉంది. పొడిగింపు నేపథ్యంలో మరో ఏడాది కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement