కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం నిర్వీర్యమైంది. నాణ్యమైన వ
అనంతపురం హాస్పిటల్: జిల్లాలోని సీహెచ్‌సీల్లో సమస్యలు తిష్ట వేశాయి. ఉమ్మడి జిల్లా ప్రజలకు పెద్ద దిక్కైన అనంతపురం సర్వజనాస్పత్రిలో అయితే, సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. కొందరు వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓపీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీలపై భారం వేసి వెళ్లిపోతున్నారు. ఇటీవల ఏకంగా డెంటల్ ఓపీకి తాళాలు వేసేశారు.
● ఆస్పత్రిలో సిబ్బంది యథేచ్ఛగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కళ్యాణదుర్గానికి చెందిన శ్రీకాంత్ తమ బంధువు ఒకరికి అనారోగ్యంగా ఉంటే జీజీహెచ్‌కు తీసుకురాగా, రోగిని తరలించడానికి క్యాజువాలిటీలో ఉన్న ఓ ఎంఎన్‌ఓ వంద కొట్టాల్సిందేనన్నాడు. చేసేది లేక రూ.50 ఇచ్చినట్లు శ్రీకాంత్ తెలిపాడు.
● కొన్ని రోజుల క్రితం వజ్రకరూరుకు చెందిన శ్రీలక్ష్మి రెండో కాన్పు కోసం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. ప్రసవం అయ్యాక ఆడబిడ్డ అని తెలియగానే అక్కడి క్లాస్–4 సిబ్బంది రూ.500 డిమాండ్ చేశారు. శ్రీలక్ష్మి మొదట రూ.వంద ఇవ్వగా.. ‘మేం నలుగురున్నాం, వంద సరిపోదు’ అంటూ వాదించడంతో చివరకు రూ.400 ఇవ్వాల్సి వచ్చింది. ఆస్పత్రిలో మెడిసిన్, సర్జరీ, ఆర్థో, పీడియాట్రిక్, గైనిక్, లేబర్, పల్మనాలజీ తదితర వార్డుల్లోనూ కొందరు ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌లు, క్లాస్–4 సిబ్బంది అందినకాటికి దోచేస్తున్నట్లు తెలిసింది.
● ఆస్పత్రిలో రక్తపరీక్షలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. బయోకెమెస్ట్రీకి సంబంధించి రీ ఏజెంట్ లేకపోవడంతో థైరాయిడ్ ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ ఆగిపోయింది. ప్రైవేట్‌గా థైరాయిడ్ పరీక్ష రూ.600, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షను రూ.150 ఇచ్చి చేయించుకోవాల్సి వస్తోంది.
గుంతకల్లు ఆస్పత్రి.. మైనర్ ఆపరేషన్లతో సరి..
● రోజు ఓపీ: 600–700
గుంతకల్లు పట్టణంలోని శ్రీరాయ్‌సాహెబ్ మిడతల హంపయ్య ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. నాలుగు సివిల్ సర్జన్ (జనరల్, పీడియాట్రీషన్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, రేడియాలజిస్ట్)లతో పాటు స్టాఫ్ నర్సు పోస్టులు 10 ఖాళీలున్నాయి. ఫార్మసీ సూపర్‌వైజర్,గ్రేడ్–1 ఫార్మసిస్ట్,డార్క్‌రూమ్ అసిస్టెంట్–2, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్–1, అలాగే పరిపాలనా విభాగంలో పలు పోస్టులు ఖాళీలున్నాయి. సివిల్ సర్జన్‌ల కొరత కారణంగా సిజేరియన్, మైనర్ ఆపరేషన్లు తప్ప పెద్ద ఆపరేషన్లు జరగడం లేదు. బ్లడ్‌బ్యాంక్‌లో కూడా స్టాఫ్ నర్సు–1, టెక్నీషియన్లు–3, కౌన్సిలర్–1 ఖాళీలున్నాయి. మందుల కొరత కూడా ప్రధాన సమస్యగా మారింది. చర్మ రోగాలకు సంబంధించి (ఫ్లూకొనజోల్, ఇట్రాకొనజోల్), హెర్పిస్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌లకు ఇచ్చే (పసిక్లోవిర్), నొప్పులకు సంబంధించి (ట్రెమడాల్), గజ్జి, పగుళ్లకు సంబంధించిన మందులు, ఆయింట్‌మెంట్, ముక్కులో వేసుకునే డ్రాప్స్‌ను కూడా ప్రభుత్వం సరిగా సరఫరా చేయడం లేదు. అంతేకాకుండా ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, సిబ్బందికి అవసరమైన సర్జికల్ గ్లౌవ్స్‌ను కూడా సక్రమంగా సరఫరా చేయకపోవడంతో బయటి నుంచి తెప్పించుకుంటున్నారు.
సర్వజనాస్పత్రిలో మందుల కొరత వేధిస్తోంది. కాన్పు కోసం ఇటీవల దివ్య అనే గర్భిణి ఆస్పత్రిలో అడ్మిట్ కాగా, వైద్యులు కొన్ని మందులు రాసిచ్చారు. అయితే, ఆ మందులు ఆస్పత్రిలో లేకపోవడంతో దివ్య ప్రైవేట్ మెడికల్ స్టోర్‌లో రూ.430 వెచ్చించి కొనుగోలు చేశారు. ఆస్పత్రిలోని గైనిక్, లేబర్, మెడిసిన్, ఐసీసీయూ, ఎమర్జెన్సీ, ఏఎంసీ, ఆర్థో తదితర వార్డుల్లో అమాక్సీక్లేవ్, సెఫిగ్జిమ్, పారాసిట్‌మాల్, సెట్రిజిన్, మెట్‌ఫార్మిన్, సెఫొపెరాజాన్, పాంటాప్రజోల్ తదితర మాత్రలతో పాటు ఐవీ ఇంజెక్షన్లు లేవు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యల తిష్ట
భర్తీ కాని వైద్యులు, సిబ్బంది పోస్టులు
వేధిస్తున్న మందుల కొరత
సౌకర్యాల కల్పనపై
కూటమి సర్కారు నిర్లక్ష్యం
ఉమ్మడి జిల్లా నుంచి వైద్యారోగ్య శాఖ మంత్రి ఉన్నా ప్రయోజనం శూన్యం
కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం నిర్వీర్యమైంది. నాణ్యమైన వ
కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం నిర్వీర్యమైంది. నాణ్యమైన వ


