బుచ్చెయ్యపేట : తురకలపూడిలో వైఎస్సార్సీపీ నేతపై దాడి చేస్తున్న కూటమి నేతలు
బుచ్చెయ్యపేట : మండలంలో గల తురకలపూడి గ్రామంలో వైఎస్సార్సీపీ ఏజెంట్ ఉల్లింగల రాజారావుపై కూటమి నేతలు దాడి చేశారు. పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తరవాత బూత్‌లో ఉన్న కూటమి నేతలను బయటకెళ్లాలని అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్ రాజారావు వారికి సూచించారు. దీంతో కూటమి నేతలు రాజారావుపై దాడి చేశారు. కూటమి నేతల దాడిలో రాజారావుతో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. దీనిపై బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితుడిని ఎంపీపీ పోటీ అభ్యర్థి దొండా రాంబాబు, మాజీ సర్పంచ్‌లు గంట్ల అప్పలనాయుడు, కోరుకొండ అప్పలనాయుడు తదితరులు పరామర్శించారు. దాడి చేసిన కూటమి నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.


