కె.కోటపాడు : 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను తప్పకుండా వేయాలని వైద్య సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి అచ్యుతకుమారి ఆదేశించారు. లంకవానిపాలెం పీహెచ్‌సీని ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అన్ని రకాలైన వ్యాధి నిర్ధారిత పరీక్షలను జరపాలని సూచించారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలను జరుపుకొనేలా వారికి వివరించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం క్షేమ దాయకమని వివరించాలని సూచించారు. లంకవానిపాలెం పీహెచ్‌సీలో ఉన్న వ్యాక్సిన్‌లను పరిశీలించారు. ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండడంతో పాటు వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న వైద్యసేవలపై వైద్యాధికారి శైలజను డీఎంహెచ్‌వో అచ్యుతకుమారి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో శంకరరావు, హెచ్‌ఎస్.హిక్సియా, హెల్త్ అసిస్టెంట్ పి.త్రినాథ్ ఉన్నారు.


