గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Nov 5 2026 12:28 AM | Updated on Nov 5 2026 12:28 AM

డాబాగార్డెన్స్‌: హార్బర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అనకాపల్లి గేట్‌ విద్యుత్‌ స్తంభం వీపీఏ/ఎంఎన్‌/87 సమీపాన ఫ్లైఓవర్‌ కింద గుర్తు తెలియని ఒక వ్యక్తి మృతదేహాన్ని హార్బర్‌ పోలీసులు గుర్తించారు. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు చేపడుతున్న అరవింగ్‌ టెక్నో ఇన్‌ఫ్రా సంస్థలో సెక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఫిర్యాదుదారుడు అలవరపు విజయ్‌బాబు ఆ మృతదేహాన్ని గుర్తించి సమాచారం అందించాడని హార్బర్‌ పీఎస్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ మోహనరావు తెలిపారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని, అనకాపల్లి గేట్‌ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించే వాడని, మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఉండేవాడని, అనారోగ్యం, ఆకలి, వర్షపు వాతావరణానికి గురై మరణించి ఉండవచ్చని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు హార్బర్‌ పీఎస్‌ సీఐ కె.మల్లేశ్వరరావును 94407 96013, ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ మోహనరావును 83310 41665 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement