స్థానిక ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అబ్జర్వర్ గోపాలకృష్ణ
రోలుగుంట : ఈ నెల 5 న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ బుధవారం రాత్రి సందర్శించారు. ఆర్వో టి.కొండలరావు, ఏఆర్వోలు వి.ఎస్.నాగేశ్వరరావు, శెట్టి నాగమ్మను ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలపై ఆరా తీశారు. రిజర్వు సిబ్బందిని అలర్ట్ చేయాలన్నారు. అవసరమైన చోట సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఉండే చర్యలు తీసుకోవాలన్నారు.


