పాయకరావుపేట: మండలంలో పెంటకోట గ్రామానికి చెందిన గేదెల మనోజ్ కుమార్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. తిరుపతి వెరిటాస్ సైనిక్ స్కూల్లో మనోజ్ కుమార్ చదువుతున్నాడు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌లో జరిగిన అండర్ – 19 బాయ్స్ కబడ్డీ పోటీల్లో స్టేట్ ఫైనల్ విన్నర్‌గా వెరిటాస్ సైనిక్ స్కూల్ విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని విద్యార్థి మనోజ్‌కుమార్ తండ్రి చిన అప్పలరాజు తెలిపారు.


