వైభవంగా గిరి ప్రదక్షిణలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా గిరి ప్రదక్షిణలు

Jul 29 2026 1:40 AM | Updated on Jul 29 2026 1:40 AM

మునగపాక, దేవరాపల్లి మండలాల్లోని మూడు గ్రా మాల్లో మంగళవారం వైభవంగా గిరిప్రదక్షిణలు నిర్వ హించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మునగపాక: మండలంలోని వాడ్రాపల్లి, తోటాడ గ్రామాల్లో మంగళవారం గిరి ప్రదక్షిణలు వైభవంగా నిర్వహించారు. తోటాడలోని ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వ హించిన గిరి ప్రదక్షిణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓంకార పీఠం నుంచి ప్రారంభమైన ఊరేగింపు త్రిమూర్తుల ఆలయం, మరిడిమాంబ ఆలయం, పాటిపల్లి కాలనీ, వరాహలక్ష్మీనరసింహ స్వామి ఆలయం మీదుగా నారాయుడుపాలెం నుంచి తిరిగి ఓంకార పీఠం వరకు సాగింది.

● వాడ్రాపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని వీధుల గుండా ప్రదక్షిణ సాగింది. పలు గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామి పల్లకీ మోస్తూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ ఊరేగింపు లో పాల్గొన్నార. భక్తులకు డ్రింక్స్‌, బిస్కట్లు, మునగపాకకు చెందిన వాకర్స్‌ సభ్యులు అందజేశారు.

మారేపల్లిలో..

దేవరాపల్లి: మండలంలోని మారేపల్లి పాండవుల మెట్టపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 4 గంటలకు తొలి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజల అనంతరం సుమారు 7 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిను భక్తులు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, పూజలు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణకు తరలివచ్చారు. మారేపల్లి, తెనుగుపూడి, వెంకటరాజుపురం, వాకపల్లి జంక్షన్‌ మీదుగా గిరి ప్రదక్షిణ కొనసాగింది. మారేపల్లి గోవిందనామస్మరణతో మార్మోగింది. భక్తులకు దారిపొడువునా పలువురు ప్రసాదాలు, తాగునీరు, శీతల పానీయాలను అందజేశారు. వైద్య శిబిరాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement