ఇఫ్తార్ సహర్
న్యూస్‌రీల్
గ్రామంలోనే విక్రయించే పాలు 2.25 లక్షల లీటర్లు
శుక్ర శని
అనకాపల్లి 6.07 5.02 నర్సీపట్నం 6.09 5.04
● చిన్నపాటి పరీక్షలతోనే కల్తీ గుర్తించొచ్చు..
● పాలల్లో అయోడిన్ కలిపితే నీలి రంగు వస్తే అది కల్తీ
● పాలను మరిగిస్తే పసుపు రంగులోకి మారితే సర్ఫ్, సబ్బు, నూనె కల్తీ ఉన్నట్టే!
శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
అనకాపల్లి టౌన్ : ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రించే వరకూ చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పాలను విరివిగా వాడుతుంటారు. అలాంటి పాలలోనూ కల్తీ జరిగి ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించగా..పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లనివన్నీ పాలు కావనేలా..స్వచ్ఛమైన పాలల్లో కూడా కల్తీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిచెన్‌లోనే కల్తీ పాలను గుర్తించవచ్చంటూ పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏవి స్వచ్ఛమైన పాలు..ఏవి కల్తీ పాలు అనేది చిన్నపాటి చిట్కాలతో గుర్తించవచ్చు. ఒకనాడు నగరాల్లో, పట్టణాల్లో కల్తీ జరిగేవి..కానీ ప్రస్తుత పరిఽస్థితుల్లో గ్రామ స్థాయిలోనే కల్తీ ముఠాలు ఎక్కువవుతున్నాయి. పాడి రైతు రోజంతా కష్టపడి పాడి పశువులను మేత వేసి..స్వచ్ఛమైన పాలను డెయిరీలకు అతి తక్కువ ధరకే పోస్తున్నారు. కానీ అలాంటి స్వచ్ఛమైన పాలనే కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ ముఠాలు ఎక్కువైపోతున్నాయి.పాలు చిక్కగా ఉండేందుకు మొక్కజొన్న పిండి, వెన్న శాతం ఎక్కువగా ఉండేందుకు వంట నూనెలు, నురగ కోసం డిజర్జెంట్, యూరియా వంటివి కలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని కల్తీముఠాలు సింథటిక్ పాలు తయారు చేస్తున్నాయి కూడా.
స్వచ్ఛత తెలిసేదెలా..
రోజూ మనం మార్కెట్ నుంచి కొనుగొలు చేసుకునే పాలు స్వచ్ఛమైనవా..? లేదంటే ఏదైనా కల్తీ జరిగిందా..? అనేది ఇంట్లోనే కొద్ది పాటి చిట్కాలు, జాగ్రత్తలతోనే గుర్తించవచ్చు.
●స్వచ్ఛమైన పాలు స్వల్ప తీపి వాసన కలిగి ఉంటుంది. క్రీమ్ రుచిని కలిగి ఉంటాయి. అలా కాకుండా పాలు చేదుగా లేదా వింతైన రసాయన వాసన కలిగి ఉంటే అవి కల్తీ పాలుగా గుర్తించవచ్చు.
●పాలను బాగా మరిగించినప్పుడు అవి పసుపు రంగులోకి మారితే..అందులో సర్ఫ్, సబ్బు లేదా నూనే పదార్థాలు కలిపారని భావించాలి. అదే స్వచ్ఛమైన పాలను మరిగిస్తే రంగు మారదు.
●కొద్దిగా పాలు తీసుకొని అందులో ఒకటి లేదా రెండు అయోడన్ ద్రావణం చుక్కలు వేసిన వెంటనే పాలు నీలి రంగులోకి మారితే ..అందులో పిండి లేదా స్టార్చ్ కలిపారని గుర్తించాలి. అలా కాకుండా పాలు సాధారణ తెలుపు రంగులోనే ఉంటే కల్తీ జరగలేదని అర్థం
●పాలల్లో నీరు అధికంగా కలిపితే..దాన్ని గుర్తించే చిట్కా..ఒక పలకను ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్కలను జార విడవాలి. పాలు నెమ్మదిగా తెల్లని గీత లాగ కిందకు జారితే స్వచ్ఛ మైనవిగా గుర్తించవచ్చు. అలా కాకుంకా చాలా వేగంగా జారితే మాత్రం పాలలో నీరు కలిసినట్టుగా గుర్తించాలి.
●స్వచ్ఛమైన పాలు కాచి చల్లాచ్చిన తర్వాత పైన మీగడ చిక్కగా అంటే మందంగా కడుతుంది. కానీ కల్తీ పాలు అయితే వేడి చేసినప్పుడు సరైన మీగడ రాదనే విషయాన్ని కూడా గమనించాలి.
●అలాగే పాలను సీసాలో వేసి బాగా కుదిపితే అధికంగా నురగ వస్తే కల్తీ జరిగినట్టు గుర్తించాలి. అలాగే 5 మిల్లీ లీటర్ల పాలలో 2 స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం నీలి రంగులోకి మారితే..
పాలలో గంజి పౌడర్ కలిపినట్లు గుర్తించాలి.
●ఇక అన్నిటికంటే ముఖ్యంగా నీటిలో యూరియాను వినియోగించి కల్తీ పాలను తయారు చేస్తున్నారు. ఈ కల్తీని యూరియా స్ట్రిప్ ద్వారా గుర్తించవచ్చు. ఈ స్ట్రిప్స్ మందుల షాపులో లభ్యమవుతాయి. వాటిని ఉపయోగించి కల్తీ పాలలో యూరియా కలిసిందా లేదా అనేది స్వయంగా మనమే గుర్తించవచ్చు.
తనిఖీలు ముమ్మరం చేశాం
పాలు కల్తీని నిరోధించడానికి తనిఖీలు ముమ్మరం చేశాం. కల్తీపాలు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదులు చేయండి. ఇప్పటికే కల్తీ పాలను గుర్తించడానికి ఆధునిక పద్ధతులు పాటిస్తున్నాం. గ్రామస్థాయి నుంచి పట్టణాల్లో కూడా కల్తీ పాలు గుర్తించడంపై అవగాహన కల్పిస్తున్నాం. సాధారణ గృహ పరీక్షల నుంచి అధునాతన ప్రయోగశాల స్పెక్టోస్కోపీ వరకూ అన్ని పద్ధ్దతుల ద్వారా కల్తీకి చెక్ పెడుతున్నాం.
–డాక్టర్ బి.రామ్మోహన్ రావు,
జిల్లా పశువర్ధక శాఖ అధికారి,
అనకాపల్లి జిల్లా
సబ్‌జైల్‌ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి
ఖైదీలకు తయారు చేసిన భోజనాన్ని పరిశీలిస్తున్న సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్
నర్సీపట్నం : సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ గురువారం స్థానిక సబ్‌జైల్‌ను సందర్శించారు. ఖైదీలకు తయారు చేసిన ఆహారపదార్థాలను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించారు. జైల్‌లో అందుతున్న సౌకర్యాలపై ఖైదీలను ఆరా తీశారు. ఏయే కేసుల్లో రిమాండ్‌లో ఉన్నారని ఖైదీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెయిల్ పెట్టుకునేందుకు ఆర్థికస్తోమత లేకపోతే మండల న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునని సీనియర్ సివిల్ ఖైదీలకు సూచించారు. ఆయన వెంట కోర్టు సిబ్బంది ఉన్నారు.
డెయిరీలకు వెళ్లే పాలు 6.73 లక్షల లీటర్లు
జిల్లాలో రోజుకి 8.98 లక్షల
లీటర్ల పాల ఉత్పత్తి
చిటికెలో...
లోపాలు తేటతెల్లం
ఇఫ్తార్ సహర్
ఇఫ్తార్ సహర్
ఇఫ్తార్ సహర్
ఇఫ్తార్ సహర్
ఇఫ్తార్ సహర్


