సౌత్‌ కోస్ట్‌ రైల్వే పీఎఫ్‌ఏగా హరిప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

సౌత్‌ కోస్ట్‌ రైల్వే పీఎఫ్‌ఏగా హరిప్రసాద్‌

Feb 27 2026 7:26 AM | Updated on Feb 27 2026 7:26 AM

సౌత్‌ కోస్ట్‌ రైల్వే పీఎఫ్‌ఏగా హరిప్రసాద్‌

సౌత్‌ కోస్ట్‌ రైల్వే పీఎఫ్‌ఏగా హరిప్రసాద్‌

శ్రీకాకుళం వాసికి కీలక పదవి

తాటిచెట్లపాలెం: సౌత్‌ కోస్ట్‌ రైల్వే ప్రిన్సిపల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌(పీఎఫ్‌ఏ)గా డాక్టర్‌ పూడి హరిప్రసాద్‌ నియమితులయ్యారు. మార్చి 1న ఆయన ఈ బాధ్యతలను అధికారికంగా స్వీకరించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఆయన 1993వ బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ రైల్వేస్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌ సీనియర్‌ అధికారి. శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామానికి చెందిన డాక్టర్‌ హరిప్రసాద్‌కు ఉన్నత విద్యా నేపథ్యం ఉంది. సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి బీటెక్‌ (సివిల్‌) పూర్తి చేసిన ఆయన.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ (మార్కెటింగ్‌), ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ(ఫైనాన్స్‌) పట్టాలు పొందారు. ఆ తర్వాత పవర్‌ సెక్టార్‌ రిఫార్‌మ్స్‌ అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రజా పరిపాలన, ఆర్థిక నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జాతీయ ప్రాజెక్టుల రూపకల్పన వంటి కీలక రంగాల్లో ఆయనకు దాదాపు మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో వాల్తేరు డివిజన్‌లో సీనియర్‌ డివిజనల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌గా కూడా డాక్టర్‌ హరిప్రసాద్‌ సేవలందించారు. ఇప్పుడు మళ్లీ అదే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న సౌత్‌ కోస్ట్‌ రైల్వేలో కీలక పదవి చేపట్టనుండటం పట్ల రైల్వే అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement