సహకార ఉద్యోగుల సమ్మె విరమణ
మాడుగుల : ఈ నెల 16 వ తేదీ నుంచి తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మెను ఈ నెల 25 వ తేదీతో ముగించామని, అనకాపల్లి జిల్లా పీఎసీఎస్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు బొడ్డేడ లక్ష్మణరావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జేఎసీ జరిపిన చర్చల్లో లక్ష రూపాయలు నుంచి రూ.4 లక్షలకు గ్రాట్యూటీ పెంచామని, టర్మ్ ఇన్సూరెన్స్ రూ. 5 లక్షలు పెంచామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించామన్నారు. తమకు సమ్మెకాలంలో అన్నివిధాలా సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఆయన వెంట సహకార సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు.


