శరీర సౌష్టవ పోటీల్లో అనకాపల్లి క్రీడాకారుల ఘనత
మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో బహుమతులు సాధించిన క్రీడాకారులు సంతోష్, ప్రసాద్‌తో జిమ్ సభ్యులు
అనకాపల్లి : క్రీడాకోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని అవినాష్ జిమ్ నిర్వహకులు ఐ.ఆర్.గంగాధర్ అన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో కాకినాడ, విశాఖపట్నం నగరాలలో జరిగిన ‘మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్‘ పోటీలలో అవినాష్ పవర్ జిమ్ సభ్యుడు పినపోతుల సంతోష్ ప్రథమ(కాకినాడలో) స్థానం, పి.ప్రసాద్ ద్వితీయ(విశాఖలో) స్థానం సాధించారు. గురువారం జిమ్ ఆవరణలో గంగాధర్ శాలువాలతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో యువత తన జీవిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. యువత సామాజిక కార్యక్రమంలో కూడా పాల్గొంటూ సమాజంలో బాధ్యత గల పౌరులుగా మెలగాలన్నారు. కార్యక్రమంలో జిమ్ మేనేజర్ గొర్లె స్వామి గౌడ్, సభ్యులు అవినాష్, బుద్ధ గణేష్, బుచ్చిరాజు, నాగేశ్వరరావు, ఎర్రంశెట్టి గోపి, కర్రి చిన్న ,రాజు ,శ్రీరామ్‌మూర్తి పాల్గొన్నారు.


