దార్లపూడిలో జాతీయ జెండాకు అవమానం | - | Sakshi
Sakshi News home page

దార్లపూడిలో జాతీయ జెండాకు అవమానం

Jan 27 2026 8:00 AM | Updated on Jan 27 2026 8:00 AM

దార్లపూడిలో జాతీయ జెండాకు అవమానం

దార్లపూడిలో జాతీయ జెండాకు అవమానం

పాఠశాల జెండా పోల్‌ వద్ద నేలపై పడిన జాతీయ జెండా

ఎస్‌.రాయవరం: హోంమంత్రి ఇలాకాలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని దార్లపూడి ప్రాథమిక పాఠశాల (హెచ్‌)లో సోమవారం జెండా ఆవిష్కరణ అనంతరం ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో మధ్యాహ్నం జెండా నేలపై పడిపోయింది. ఈ విషయం విద్యాశాఖాధికారులు దృష్టికి వెళ్లడంతో హెచ్‌ఎం భాస్కరరావును పాఠశాలకు పంపించి నేలపై పడిన జెండాను శుభ్రం చేసి భద్రపరచారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలు ఈ పని చేసిఉంటారని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement