జీడి పిక్కల ఫ్యాక్టరీ వద్ద మహిళా కూలీల ఽఽనిరసన
రావికమతం : మండలంలో మేడివాడ జీడి ఫ్యాక్టరీ వద్ద ఫాక్టరీలో పనిచేయడానికి తక్షణమే విధుల్లోనికి తీసుకోవాలని మహిళా కూలీలు సోమవారం ధర్నా చేశారు. మేడివాడ జీడి పిక్కల ఫ్యాక్టరీలో మహిళలు 15 ఏళ్ల నుంచి సుమారు 200 మంది వరకు పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే యాజ్యమాన్యం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుమారు 180 మందిని పనిలోంచి తొలగించింది. దీంతో 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను అర్ధంతరంగా పనికి రావద్దంటే ఎలా బతకాలి అంటూ ఫాక్టరీ వద్ద ఆందోళన చేశారు. తమని పనిలోకి తీసుకొనే వరకు ఫ్యాక్టరీని తెరవనీయమని హెచ్చరించారు.


