కిరాణాషాపులో 103 మద్యం బాటిళ్లు
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు
నక్కపల్లి : మండలంలో చందనాడ గ్రామంలో అనధికారికంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను నక్కపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీఐ మురళికి వచ్చిన సమాచారం మేరకు చందనాడలో సోమవారం మేడిశెట్టి అప్పలరాజు కిరాణా షాప్ నుంచి 91 మద్యం బాటిళ్లు, 12 బీరు బాటిళ్లను పట్టుకోవడం జరిగిందన్నారు. వీటి విలువ రూ.19వేలు ఉంటుందన్నారు. అప్పలరాజుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు.


