భారీ కొండచిలువ హతం
వాకపల్లి మెట్ట సమీపంలో స్థానికుల చేతిలో హతమైన భారీ కొండ చిలువ
దేవరాపల్లి: మండలంలోని వాకపల్లి మెట్ట సమీపంలో గురువారం భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. స్థానిక పంట పొలాల్లో సంచరిస్తూ రైతుల కంట పడింది. సుమారు 10 అడుగుల మేర పొడవున్న కొండ చిలువను చూసిన రైతులు ఆందోళనతో ఒక్కసారిగా పరుగులు తీశారు. కొంత సేపటి తర్వాత తేరుకున్న రైతులు పశువులకు ప్రమాదం పొంచి ఉండడంతో అతి కష్టం మీద కర్రలతో కొట్టి హతమార్చారు. గ్రామంలో తొలిసారిగా భారీ కొండ చిలువ రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యంగా వీక్షించారు.


