చిననందిపల్లిలో వైభవంగా మరిడిమాంబ జాతర
దేవరాపల్లి: మండలంలోని మరిడిమాంబ పండగ గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన కొయ్య రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలుత ఈ రథానికి గ్రామస్తులు పసుపు కుంకుమ సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా తీన్‌మార్ వాయిద్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, పులి వేషాలు జాతరలో విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
వాకీటాకీలతో కమిటీ సభ్యుల పర్యవేక్షణ....
గ్రామ జాతరలో కమిటీ సభ్యులంతా పండగ ఏర్పాట్లతోపాటు ఎటువంటి అవాంతరాలు ఏర్పడిన తక్షణమే స్పందించేందుకు వాకీటాకీలను వినియోగించారు. జాతరలో ఇలా తొలిసారిగా వాకీటాకీలతో కమిటీ సభ్యులు కనిపించడంతో పండగకు హాజరైన భక్తజనం ఆసక్తిగా తిలకించారు.
ఆకట్టుకున్న పులి, దేవతామూర్తుల వేషధారణలు
చిననందిపల్లిలో వైభవంగా మరిడిమాంబ జాతర


