త్వరితగతిన యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు
తుమ్మపాల: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 11ను పురస్కరించుకుని యోగాను మరింత విస్తృంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి మండలాల్లో, గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో యోగాభ్యాస కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. జిల్లాలో 7 నియోజకవర్గ పర్యాటక ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం బీచ్ పర్యాటక ప్రాంతం వద్ద ఉదయం 7 గంటలకు యోగాంధ్ర కార్యక్రమన్ని ప్రారంభించనున్నామన్నారు.
– యోగా గురువులు, యోగా శిక్షకులు, వలంటీర్లు, యోగా అభ్యాసకులు, సాధారణ ప్రజలు తమ పేర్లను https:// yogandhra. ap. gov. in/#/ home/ yoga& registration వైబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.లావణ్య, జిల్లా ఆయుష్ అధికారి, ఎంపీడీవోలు, నియోజకవర్గ మండల స్థాయి ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.


