భార్య, కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు
మునగపాక: మండలంలోని ఒంపోలుకు చెందిన వివాహితతో పాటు రెండేళ్ల పాప కనిపించలేదంటూ అందిన ఫిర్యాదు మేరకు మునగపాక పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఒంపోలుకు చెందిన దాసరి సన్యాసినాయుడు భార్య లలిత అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో పని చేస్తుంది. ఈ నెల 24న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు డ్యూటీకి వెళ్లిన లలిత రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో కంగారుపడి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం సన్యాసినాయుడు మునగపాక పోలీసు స్టేషన్‌లో తన భార్య లలితతో పాటు రెండేళ్ల కుమార్తె రియాన్సీ కనిపించలేదని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


