గెడ్డ దాటించి.. ప్రాణాలు కాపాడి! | - | Sakshi
Sakshi News home page

గెడ్డ దాటించి.. ప్రాణాలు కాపాడి!

Sep 27 2026 1:16 AM | Updated on Sep 27 2026 1:16 AM

డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ కోసంగి గ్రామానికి చెందిన వంతల చంద్రశేఖర్‌ శనివారం శ్వాస సంబంధిత వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు చాపరాయి జలపాతానికి సమీపంలోని గెడ్డ దాటాల్సి వచ్చింది. గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అంబులెన్స్‌ గ్రామంలోకి చేరలేకపోయింది. దీంతో వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి మఠం శంకర్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చారు. బాధితుడిని భుజాలపై మోసుకుంటూ మోకాలి లోతు ప్రవాహంలో గెడ్డ దాటించారు. చాపరాయి వద్ద ఉన్న అంబులెన్స్‌లో ఎక్కించి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అరకులోయ ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఈ సహాయక చర్యల్లో మఠం గజేంద్ర, వంతల జగన్నాథం, మఠం రాంబాబు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement