గొలుగొండ : చెరువులో నీరు తాగడానికి వెళ్లిన పాడి గేదెలు రైతు కళ్ల ముందే నీట మునిగి చనిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఎర్రవరం గ్రామం వద్ద ఉన్న చెరువు ప్రమాదస్థాయిలో నిండిపోయింది. ఎప్పటిలానే ఎర్రవరం గ్రామానికి చెందిన రైతు పొదిరి కన్నబాబు శనివారం మధ్యాహ్నం పాడి గేదెలను మేత కోసం ఎర్రవరం సమీపంలో ఉన్న రాజులుబాబు గుడి వద్దకు తీసుకువెళ్లాడు. సాయంత్రం నీళ్ల కోసం గేదెలు చెరువు వద్దకు వెళ్లాయి. కాళ్లకు, మెడకు తాళ్లు కట్టి ఉండడం, చెరువు పూర్తిగా నిండి ఉండడంతో నీటిలో దిగిన గేదెలు మునిగి చనిపోయాయి. పాడిగేదెల మృతితో సుమారుగా 6 లక్షలు నష్టం వాటిల్లిందని రైతు కుటుంబం కన్నీరుమున్నీరైంది. పాడిపైనా ఆధారపడి ఉన్న కుటుంబం రోడ్డున పడింది. విషయం తెలిసిన వెంటనే ఎంపీడీవో శ్రీనివాసరావు. స్ధానిక రెవెన్యూ సిబ్బంది చెరువు వద్దకు వెవెళ్లి నీట మునిగిన పాడి గెదెలను ఒడ్డుకు తీసుకురావడానికి చర్య లు చేపట్టారు. జీవనాధారం కోల్పోయిన తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కుటుంబం అధికారులను వేడుకుంది.


