చిన్నారులకు ఆటపాటలతో బోధన | - | Sakshi
Sakshi News home page

చిన్నారులకు ఆటపాటలతో బోధన

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

● జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు

నర్సీపట్నం: ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్య నేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్‌.నాగేశ్వరరావు అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని జెడ్పీ హైస్కూల్‌(తురకబడి)లో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్‌వాడీ కేంద్రాల్లో సక్రమంగా అమలు చేయాలన్నారు. ఇంగ్లిష్‌పై ప్రత్యేక దృష్టి సారించి, చిన్నారులను ఆ దిశగా తీర్చిదిద్దాలన్నారు. పిల్లలకు సులభంగా అర్థం కావాలంటే ఆటపాటల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో జి.వి.రమణి, ఏఎంవో కెజియా, ఎంఈవో సిహెచ్‌.తలుపులు, రిసోర్స్‌పర్సన్లు కె.ఆర్‌.పి.ఎం.నాగేశ్వరరావు, బి.ఎస్‌.ఆర్‌.గోవింద్‌, కె.గణేష్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు కె.రామలక్ష్మి, పి.అప్పలనర్స పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement