చింతపల్లిలో మూతబడిన పెట్రోల్‌ బంక్‌ | - | Sakshi
Sakshi News home page

చింతపల్లిలో మూతబడిన పెట్రోల్‌ బంక్‌

Aug 25 2026 12:45 AM | Updated on Aug 25 2026 12:45 AM

చింతపల్లి: గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రం చింతపల్లిలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌ సోమవారం మూత పడింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండలంలో ఉన్న ఈ ఏకై క బంక్‌ ద్వారా రోజుకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు పెట్రోల్‌, డీజిల్‌ విక్రయిస్తారు. సోమవారం పెట్రోలు ట్యాంక్‌ రాకపోవడంతో బంక్‌ మూతపడింది. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిపోయే పలువురు వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల తరచూ పెట్రోలు కొరత ఏర్పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా గిరిజన సహకార సంస్థ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement