చింతపల్లి: స్థానిక ఆచార్య ఎన్‌జీ రంగా సేంద్రియ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 26వ తేదీన నిర్వహించాల్సిన కౌన్సెలింగ్‌ను ఒక రోజు వాయిదా వేసి, 27న నిర్వహించనున్నట్టు వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. గుంటూరు లాం కళాశాలలో జరిపిన కౌన్సెలింగ్‌లో చింతపల్లి సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ఉన్న 25 సీట్లకు గాను 12 సీట్లు భర్తీకాగా, 13 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి భర్తీకి మొదట ఈ నెల 26న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించినప్పటికీ, ఆ రోజు సెలవు కావడంతో 27వ తేదీకి వాయిదా వేశామని చెప్పారు. ఈ విషయాన్ని అర్హత గల అభ్యర్థులు గమనించాలన్నారు.ఈ కౌన్సెలింగ్‌కు ఇంటర్ పాస్, ఫెయిల్ అయిన వారితో పాటు పదవ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 9014637080 లో సంప్రదించాలని కోరారు.


