నర్సీపట్నం: జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారిగా పని చేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందిన లక్ష్మణ్ సోమవారం గుండెపోటుతో విశాఖలో మృతి చెందారు. నర్సీపట్నం ఏరియాలో వివిధ హోదాల్లో ఆయన పని చేసి అందరికీ సుపరిచితులయ్యారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. స్వస్థలం విజయనగరం జిల్లా అయినప్పటికీ, కుమార్తె చదువు నిమిత్తం విశాఖలో ఉంటున్నారు. నర్సీపట్నం డీఎఫ్‌వోగా, రేంజర్‌గా సేవలు అందించారు. చింతపల్లి డీఎఫ్‌వో, సబ్ డీఎఫ్‌వోగా పని చేశారు. నూతన జిల్లాలు ఏర్పాటు అయిన తరువాత జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారిగా సేవలు అందించి గత ఏడాది జూన్‌లో పదవీ విరమణ పొందారు. నర్సీపట్నం, చింతపల్లి డివిజన్‌ల్లో పని చేసిన సిబ్బంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.


