జాతీయస్థాయి రెజ్లింగ్‌లో కేజీబీవీ విద్యార్థినికి పతకం | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి రెజ్లింగ్‌లో కేజీబీవీ విద్యార్థినికి పతకం

Aug 25 2026 12:45 AM | Updated on Aug 25 2026 12:45 AM

మాకవరపాలెం: జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో కేజీబీవీ విద్యార్థిని కాంస్య పతకం సాధించింది. స్థానిక కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కోసూరు జ్యోత్స్న ఈ నెల 21 నుంచి 23 వరకు హరిద్వార్‌లో గ్రాప్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో సైతం ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించిందని పాఠశాల ఎస్‌వో త్రివేణి సోమవారం తెలిపారు. ఈ విద్యార్థినిని ఎస్‌వోతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement