ఇటు
అటు
తుమ్మపాల: పీజీఆర్‌ఎస్ అర్జీలపై అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2 లలో నిర్వహించిన పీజీఅర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షణ చేసి, గడువులోపల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామాల్లో దళిత కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి, కుల వివక్షకు అడ్డుకట్ట వేయాలని, కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన దళితులు, సంఘాల నాయకులు కలెక్టరేట్ గేటు వరకు పాడె మోసి నిరసన తెలిపారు. కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా 71 గ్రామాలో్‌ల్ ప్రత్యక్షంగా సర్వేలు చేశామని, కనీస మౌలిక వసతులు కూడా సక్రమంగా అందడం లేదన్నారు. మంచినీటి సౌకర్యం లేకపోవడం, కుళాయి కనెక్షన్లు ఉన్నప్పటికీ నీరు రాకపోవడం, రోడ్లు అధ్వానంగా ఉండడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దళిత కాలనీల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందన్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటికలకు స్థలాలు లేకపోవడం, ఉన్న స్మశాన స్థలాలు కబ్జాలకు గురికావడం, సామాజిక భవనాలు లేకపోవడం వంటి సమస్యలు కొనసాగున్నాయన్నారు. దళితులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో వారి భూ హక్కులు ప్రశ్నార్థకంగా మారాయని, ముఖ్యంగా ఎస్.రాయవరం మండలం సైతారుపేటలో దళితులకు క్షవరం చేయడానికి నిరాకరించడం వంటి కుల వివక్ష ఘటనలు ఇప్పటికీ చోటు చేసుకోవడం ఆందోళనకరమని, దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రభుత్వ స్థలంలో సుమారు 40 ఏళ్లుగా ఇళ్లు, గుడిసెలు, పాకలు వేసుకుని నివసిస్తున్న పేద కుటుంబాలను ఎటువంటి ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా పొక్లెయిన్‌లతో తొలగించేందుకు అధి కారులు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.
దళితుల సమస్యలపై పాడె మోసి నిరసన చేస్తున్న దళితులు
కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం అర్జీలు స్వీకరించిన కలెక్టర్, జేసీ, డీఆర్వో పలు సమస్యలపై కలెక్టరేట్ ఎదుట నిరసనలు
దళిత కాలనీలపై ఇంత నిర్లక్ష్యమా...


