భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అన్నారు. ఇటీవల వార్తల్లో ప్రచారమవుతున్న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని, ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయడం, నిందితుడితో పాటు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాదిక్ ఖాన్‌పై వచ్చిన మోసం, బెదిరింపులు, ఆర్థిక దోపిడీ, వ్యక్తిగత ఫొటోలు, వీడియోల దుర్వినియోగం, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు, కుటుంబ సభ్యులకు హాని చేస్తామని బెదిరించిన ఆరోపణలు అంశాలను చట్టపరంగా పరిశీలించి, నేరం రుజువైతే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.


