సాధిక్‌ఖాన్‌పై పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

సాధిక్‌ఖాన్‌పై పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు

Aug 25 2026 12:45 AM | Updated on Aug 25 2026 12:45 AM

రావికమతం: రాజమండ్రి దగ్గర గోదావరిలో దూకి ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన సాధిక్‌ ఖాన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోమవారం రావికమతం పోలీసులకు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏఈ నూకరాజు కుటుంబంతో సంబంధాలు ఏర్పరచుకొని స్నేహంగా ఉంటూ సభ్యుల వ్యక్తిగత ఫొటోలు,వీడియోలు తీసి , వారిని మత మార్పిడిపై ఒత్తిడి తెచ్చి, బెదిరింపు చర్యలకు పాల్పడి వారిని మానసిక క్షోభకు గురి చేసి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన సాధిక్‌ఖాన్‌ను అరెస్టు చేయాలని ఫిర్యాదులో కోరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి అదేశాల మేరకు సాధిక్‌ఖాన్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు, టెలిఫోన్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌ గల్లా రాజేశ్వరరావు, మండల బీజేపీ అధ్యక్షుడు గుటాల చిన్న, ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement