‘పెద్ది’లో గిరిజనులకు అవమానం | - | Sakshi
Sakshi News home page

‘పెద్ది’లో గిరిజనులకు అవమానం

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

● వెంటనే దర్శకుడు క్షమాపణ చెప్పి ‘డైలాగ్‌’ను తొలగించాలి ● వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌

సాక్షి, పాడేరు : పెద్ది సినిమాలో గిరిజనులను కించపరిచే విధంగా ఉన్న ‘కొండ నా...’ అనే డైలాగ్‌ను వెంటనే తొలగించి దర్శకుడు బుచ్చిబాబు గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టి.సురేష్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుల్లిబాబు ఆధ్వర్యంలో పలువురు నేతలు కలెక్టర్‌ నిశాంతితో పాటు పోలీసు అధికారులను కలిశారు. వారు మాట్లాడుతూ..‘పెద్ది’లో గిరిజనుల మనోభావాలకు భంగం కలిగించేలా డైలాగులు పెట్టడం బాధాకరమన్నారు.ఆ వివాదాస్పద డైలాగ్‌ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు, పాడేరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డైలాగ్‌ను తొలగించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement