ఉత్తమ హెచ్‌డబ్ల్యూవో అవార్డు, సర్టిఫికెట్‌తో కూడా రత్నకుమారి
ముంచంగిపుట్టు: స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల వసతి గృహ నివాస అధికారి కూడా రత్నకుమారికి రాష్ట్ర స్థాయి ఉత్తమ హెచ్‌డబ్ల్యూవో అవార్డు లభించింది. విజయవాడలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ భార్గవి చేతుల మీదుగా అవార్డు, సర్టిఫికెట్‌ను అందుకున్నారు. వసతి గృహంలో విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించడం, మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారిని బాధ్యతాయుతంగా చూసుకోవడంలో రత్నకుమారి శ్రద్ధ కనబరిచారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించిన సానుకూల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆమెను ఏటీడబ్ల్యూవో స్వర్ణలత, తోటి హెచ్‌డబ్ల్యూ వోలు, ఉపాధ్యాయులు అభినందించారు.


