సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ఆత్మహత్య

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

మాడుగుల రూరల్‌: స్థానిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, టీడీపీ మాడుగల పట్టణ మాజీ అధ్యక్షుడు శ్రీనాధు మధు(52) గురువారం అర్ధరాత్రి మాడుగులలో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిప్పలమోడి వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్ట ఆయన బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ జి. నారాయణరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు. మధు మృతి పట్ల స్థానిక వ్యాపారులు, రాజకీయనాయకులు, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. మధుకు భార్య, కుమారై, కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement