పెట్రోల్‌, డీజిల్‌.. నోస్టాక్‌ | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌.. నోస్టాక్‌

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

ముంచంగిపుట్టు :మండలంలో పెట్రోల్‌,డీజిల్‌ లేకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.గత కొన్ని రోజులుగా డీజిల్‌,పెట్రోల్‌ అరకొరగా ఉండేది.సోమవారం మండలంలోని లుంగాపుట్టు,దశరిపుట్టు, బాపన్నపుట్టు గ్రామాల వద్ద ఉన్న మూడు బంకుల వద్ద పెట్రోల్‌,డీజిల్‌ పూర్తిగా లేకుండా పోయింది.దీంతో బంక్‌లకు వెళ్లిన వాహనదారులు చేసేదిలేక ఇంటి బాట పడుతున్నారు.ప్రయాణాల్లో ఉండే వాహనదారుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.మూడు పెట్రోల్‌ బంకుల వద్ద ప్రసుత్తం డీజిల్‌,పెట్రోల్‌ లేదంటూ బోర్డులు పెట్టారు. దీంతో అత్యవసర పనులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం,అధికారులు స్పందించి పెట్రోల్‌,డీజిల్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement