ఆరిలోవ(విశాఖ): విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) నూతన డైరెక్టర్‌గా డాక్టర్ వి. మన్మథరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ కె.రాంబాబును తిరిగి కేజీహెచ్‌లోని తన విభాగానికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో కేజీహెచ్ సర్జరీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ మన్మథరావును ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విమ్స్ పరిపాలనాధికారులు, వైద్యులు, సిబ్బంది డాక్టర్ మన్మథరావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విమ్స్‌ను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విమ్స్ అభివృద్ధికి సంబంధించి మాజీ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు ఇప్పటికే ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్న ఆయన, వాటి అమలుకు ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్, డాక్టర్ శిరీషతో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


