పాడేరు : తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర మహిళా విభాగం సమావేశానికి జిల్లాకు చెందిన మహిళా నేతలు హాజరయ్యారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో మహిళలకు వెన్నుపోటుపై నిర్వహించిన సదస్సులో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు జల్లిపల్లి సుభద్ర, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, పాడేరు, అరకు నియోజకవర్గాల మహిళా విభాగం అధ్యక్షులు కిలో ఊర్వశిరాణి, సమిడ వెంకటపూర్ణిమ, జిల్లా మహిళా విభాగం నేతలు లకే రామసత్యవతి, గంజాయి సూర్యకళ, గంజాయి సుశీల, కె. సింహాచలం తదితర మహిళ నేతలు పాల్గొన్నారు.


