సింహాచలం: దేవస్థానంలో ఉద్యోగం చేయడం భగవంతుడు ఇచ్చిన వరంలా భావించాలని సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. దేవస్థానంలో 42 ఏళ్లపాటు బార్బర్‌గా పనిచేసి ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన అడివివరపు కృష్ణ దంపతులను ఘనంగా సత్కరించారు. సింహగిరిపై కల్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ దంపతులకు స్వామివారి చిత్రపటం, పుష్పగుచ్ఛం అందించారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవస్థానంలో ఉద్యోగం రావడం ఒక వరమని, భగవంతుడికి, భక్తులకు అంకితభావంతో సేవలందించాలని ఉద్యోగులకు సూచించారు. 42 ఏళ్లపాటు స్వామి సేవలో తరించిన కృష్ణ అదృష్టవంతుడని కొనియాడారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో పిల్లా శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ జీవీవీఎస్‌కే ప్రసాద్, పీఆర్వో అప్పలనాయుడు, ఉద్యోగులు పాల్గొన్నారు.


