రుషికొండ బీచ్‌లో పర్యాటకుల తాకిడి
కొమ్మాది: ఉదయం నుండి సాయంత్రం వరకు భానుడి ప్రతాపానికి నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.దీంతో నగరవాసులందరూ సాయంత్రం అయ్యే సరికి సాగరతీరాన్ని ఆశ్రయించారు. పర్యాటక ప్రాంతాల్లో సందడి కనిపించింది. రుషికొండ బీచ్‌కు పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకున్నారు. బీచ్‌లో స్నానాలు చేస్తూ ఉపశమనం పొందారు. సమీపంలో ఉన్న చిల్డ్రన్స్ పార్కులో చిన్నారులు ఆటపాటలతో గడిపారు. అదే విధంగా గుడ్లవానిపాలెం బీచ్, సాగర్‌నగర్ బీచ్, తొట్లకొండ బీచ్, రామానాయుడు ఫిల్మిం స్టూడియో, ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి బీచ్, మంగమారిపేట బీచ్ ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. చిన్నారులు, పెద్దలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.


