పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏపీ పీజీసెట్ – 2026లో మంచి ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ డాక్టరు ఎ.రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి కెమిస్ట్రీ విభాగంలో ఇ.వాసు 8వ ర్యాంకు, ఎన్.నాగేశ్వరి 45వ ర్యాంకు, పి.మైథిలీ 99వ ర్యాంకు, లైఫ్ సైన్స్ విభాగంలో కె.స్నేహ 48వ ర్యాంకు, ఫిజిక్స్ విభాగంలో వై.దీప్తి 69వ ర్యాంకు, జువాలజీ విభాగంలో వై.పావని 84వ ర్యాంకు, ఎస్.లోకేశ్వరి 98వ ర్యాంకు సాధించారన్నారు. స్వయం ఉపాధి స్వావలంబన లక్ష్యాలతో సాగే తమ కళాశాలలో డిగ్రీతోపాటుగా వివిధ పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణతో ఈ ర్యాంకులు సాధించారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.


