గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు

May 31 2026 12:48 AM | Updated on May 31 2026 12:48 AM

అనకాపల్లి: కారులో రెండు బ్యాగుల్లో 56.40 కిలోల గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు రూరల్‌ సీఐ జి.అశోక్‌కుమార్‌ శనివారం తెలిపారు. మండలంలో బవులవాడలో ఎస్‌ఐ ఎ.విభూషణరావు వాహనాలు తనిఖీ చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకి వెళుతున్న కారును తనిఖీ చేయగా గంజాయి బయటపడినట్టు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లాకు చెందిన రాజు అంత్రు, మహారాష్ట్ర రాష్ట్రం థానే జిల్లాకు చెందిన రూపేష్‌ రాజు చిక్నేలను అరెస్టు చేసినట్టు చెప్పారు. వారి వద్ద నుంచి గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.28.20 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement