అనకాపల్లి: జిల్లా నూతన రిజిస్ట్రార్‌గా పి.రత్నకుమార్ నియమితులయ్యారు. ఈయన విశాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆడిట్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదోన్నతపై అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్‌గా వచ్చారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. విశాఖ జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు... ఇప్పటివరకు ఇక్కడ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. ఆయన నుంచి రత్నకుమార్ బాధ్యతలను స్వీకరించారు. జిల్లా రిజిస్ట్రార్ల సంఘం నాయకులు, సీనియర్ అధికారులు బంగారు వెంకటేశ్వరరావు, అప్పారావు, గీతాలక్ష్మి, బేగం, శ్రీనివాసరావు, శ్రీకాంత్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.


