పెదమదీనలో ప్ల కార్డులతో నిరసనకు దిగిన యువకులు
బుచ్చెయ్యపేట: రోడ్డను బాగుచేయాలని డిమాండ్ చేస్తూ ఐదు గ్రామాల యువకులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. గున్నెంపూడి,పెదమదీన,చినమదీన,కొండపాలెం,పిల్లవానిపాలెం గ్రామాల యువకులు పెదమదీనలో సమావేశమయ్యారు. అనంతరం రోడ్డును బాగు చేసి రవాణా సదుపాయం కల్పించాలని ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రోడ్డు పనులు ప్రారంభించారని, మూడేళ్లు అవుతున్న నేటికీ పూర్తి చేయలేదన్నారు. రోడ్డు గోతులతో నిండిపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా గర్భిణులు,రోగులు ఆస్పత్రికి వెళ్లడానికి నరకయాతన పడుతున్నారన్నారు. తక్షణం పెదమదీన,గున్నెంపూడి రోడ్డును బాగు చేయాలని ఐదు గ్రామాల ప్రజలు,యువకులు సోమవారం ఛలో కలెక్టరేట్‌కు వెళ్లాలని నిర్ణయించారు. సుమారు వెయ్యి మందితో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.
తల్లికి తనయ తల కొరివి
కశింకోట: ఓ కుమార్తె కన్నతల్లి రుణం తీర్చుకుంది. తన తల్లికి తల కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన కశింకోటలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక గవరపేట మేదర వీధి ప్రాంతానికి చెందిన ఆళ్ల నూకరత్నం అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. భర్త చాలా కాలం క్రితం కాలం చేశారు. ఆమె ఏకై క కుమార్తె వెంకటలక్ష్మి (బేబీ) తన తల్లికి బంధు మిత్రులతోపాటు వెళ్లి స్థానిక సాధు మఠంలోని శ్మశానంలో తల కొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది.


