డుంబ్రిగుడ చేరినఆల్ ఇండియా సైకిల్ యాత్ర
డుంబ్రిగుడ: భారతదేశ పర్యటనలో భాగంగా ఆల్ ఇండియా సైకిల్ యాత్ర సాగిస్తున్న ముగ్గురు యువకులు గురువారం డుంబ్రిగుడ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కొద్దిసేపు సేదతీరారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన మనోజ్, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన విక్రమ్, బిహార్‌కు చెందిన బిక్కూ పటేల్ కలిసి ఈ సాహస యాత్రను చేపట్టారు.గత 16 రోజుల క్రితం హైదరాబాద్‌లో ఈ యాత్రను ప్రారంభించారు. విజయవాడ, రాజమండ్రి, తుని, నర్సీపట్నం, పాడేరు మీదుగా ప్రయాణిస్తూ ప్రస్తుతం అరకులోయ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా పర్యటించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ యాత్ర పూర్తి చేయడానికి మరో 45 రోజుల సమయం పడుతుందని యాత్రికులు తెలిపారు. స్థానిక ప్రజలు కలిసి వారి సాహసాన్ని అభినందించారు.


